రాష్ట్రంలో జ్వర బాధితుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు సహా మరి కొన్ని జిల్లాల్లో మలేరియా, డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు జ్వరాల ధాటికి తట్టుకోలేక ఆసుపత్రులకు వరస కడుతున్నారు. వాతావరణ మార్పు వల్ల పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఓ కుటుంబంలో ఒకరికి మొదలైతే...వరస పెట్టి అందరినీ ఈ జ్వరాలు వేధిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్థోమత లేని వాళ్లు ప్రభుత్వ దవాఖానాల్లోనే చికిత్స కోసం పడిగాపులు పడుతున్నారు. పడకల సంఖ్య చాలకపోవటం వల్ల చాలా చోట్ల రోగులు అవస్థలు పడాల్సి వస్తోంది.
0 Comments